¡Sorpréndeme!

Rohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

2025-03-10 2 Dailymotion

  అసలు సంబంధం లేని టాపిక్. సంబంధం లేని ఫీల్డ్స్ లోకి రోహిత్ శర్మను లాగే ప్రయత్నం జరిగింది. ఈజీ టార్గెట్ అనుకున్నారో మరేమో ఓ పక్క దుబాయ్ లో మన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు జరుగుతుంటే మరో వైపు ఇండియాలో రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై విపరీతమైన చర్చ. పోనీ అదే క్రికెట్ క్రిటిక్స్ నుంచో జట్టు మాజీ ల నుంచో కాదు...పొలిటీషయన్స్ నుంచి. కేరళకు చెందిన కాంగ్రెస్ మహిళా నేత షామా మహ్మద్ రోహిత్ శర్మ మీద చేసిన కామెంట్స్ తీవ్ర ప్రకంపనలే రేపాయి. అసలు అంత లావుగా ఉన్న మనిషి కదల్లేని వ్యక్తి క్రికెట్ కు పనికి రాడని..రోహిత్ శర్మ జట్టుకు చేసిందేమీ లేదని ఘాటు వ్యాఖ్యలే చేశారు షామా మహ్మద్. ఆమెకు మద్దతుగా మరికొంత మంది రాజకీయనాయకులు వచ్చారు. వీళ్లంతా రోహిత్ మీద పడి ఎందుకు గోల పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. దేశంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నట్లు...రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేనట్లు అన్నీ వదిలేసి ఈజీ టార్గెట్ కాబట్టి రోహిత్ మీద పడిపోయి లైమ్ లైట్ సాధించారని కొంతమంది చెబుతున్న వెర్షన్. ఏదేమైనా కానీ రోహిత్ శర్మ ఫిట్ నెస్ మేటర్ పెద్ద డిబేట్ అయ్యింది. ఎవరైతే రోహిత్ ఆడలేడు అదీ ఇదీ అని ఇష్టానుసారం వాగారో..బండోడు బండోడు అంటూ హేళన చేశారో..వాళ్లందరినీ ఫైనల్లో బండకేసి బాదుతూ చాకిరేవు పెట్టాడు హిట్ మ్యాన్. న్యూజిలాండ్ బలమైన బౌలింగ్ లైనప్ ను తుత్తునియలు చేస్తూ మొదటి నుంచి తనలోని అటాకింగ్ బీస్ట్ ను బయటకు తీశాడు. కివీస్ విసిరిన 252 పరుగుల లక్ష్యం కరిగిపోయేలా...తన తర్వాతి బ్యాటర్ల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా సెల్ఫ్ లెస్ బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. సెంచరీలు, హాఫ్ సెంచరీలు చూసుకోలేదు. కొడితే కప్పు వచ్చేయాలి అంతే అదే టార్గెట్. ఉన్నంతసేపు ఒక్కోడిని పేకాడించి 83  బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు రోహిత్. అప్పటికే తర్వాత వచ్చే బ్యాటర్లకు కావాల్సినంత కాన్ఫిడెన్స్ ను అందించాడు. అందుకే భారత్ జయభేరి మోగించగానే తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ కే ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. 2011 వరల్డ్ కప్ లో ధోని తర్వాత ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో మ్యాన్ ది ఆఫ్ మ్యాచ్ గెలుచుకున్న రెండో భారతీయ కెప్టెన్ గా నిలిచాడు రోహిత్ శర్మ. కప్పు చేతికి రాగానే పిచ్ మీద అదే పొట్టేసుకుని కూర్చుని ఫిట్ నెస్ కి టాలెంట్ కి సంబంధం లేదు రా అమెజాన్ ఫారెస్ట్స్ అంటూ క్రిటిక్స్ అందరికీ మాడు పగిలిపోయే సమాధానాలు ఇచ్చాడు. ఎవరైతే ఇష్టానుసారం కామెంట్స్ చేశారో వాళ్ల చేతో ఇదో అద్భుతమైన ఇన్నింగ్స్ జట్టును ముందుండి నడిపించావ్ అంటూ ప్రశంసలు కురిపించే ట్వీట్లు పెట్టేలా చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు రోహిత్ శర్మ.